అంతా రామ మయం

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఊరూరా అత్యంత ఘనంగా జరిగాయి.

అంతా రామ మయం

 

21ఎంకేపీ2 : మాకవరపాలెం మండలం తూటిపాలలో సీతారాముల కల్యాణం 

 

 ఊరూరా.. నేత్రపర్వంగా సీతారాముల కల్యాణం

 కన్నులారా వీక్షించి తరించిన భక్తజనం

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుక

నర్సీపట్నం/అర్బన్‌, ఏప్రిల్‌ 21 : శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఊరూరా అత్యంత ఘనంగా జరిగాయి. నర్సీపట్నంలోని కాపువీధి రామాలయంలో జరిగిన వేడుకల్లో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, సుమజ దంపతులు పాల్గొన్నారు. తుని రోడ్డులోని పురాతన సీతారామ ఆలయం, అబీద్‌ సెంటర్‌లోని అయ్యరక రామమందిరం, వెంకునాయుడుపేట, కొత్తవీధి, వెలమవీధితో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో ఈ వేడుకలను జరిపించారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

గొలుగొండ /కృష్ణాదేవిపేట : మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా జరిపించారు. జోగంపేట, గొలుగొండ, శ్రీరాంపురం, కొత్తజోగంపేట, పాతమల్లంపేట, పప్పుశెట్టిపాలెం, ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేట, సీహెచ్‌.నాగాపురం, లింగంపేట,  కొంగశింగి, చోద్యం తదితర గ్రామాల్లో ఈ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.  

మాకవరపాలెం : మండల కేంద్రం మాకవరపాలెంతో పాటు తూటిపాల, బూరుగుపాలెం, తామరం, రామన్నపాలెం, కొండలఅగ్రహారం తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 

నాతవరం : మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.  నాతవరం రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ వేడుకలను జరిపించారు.  మూలగపూడి దళితవాడలో ఘనంగా జరిపారు.  గుమ్మిడిగొండ రామాలయంలోనూ జరిగాయి. ఆయా సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు, పలు పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

పాయకరావుపేట/రూరల్‌ : శ్రీరామ నవమి వేడుకలు పాయరావుపేట మండలంలో అత్యంత వైభవంగా జరిగాయి.  పట్టణంలోని మంగవరం రోడ్డులో గల సీతారామాలయం, నాగరాజుపేట, దుర్గానగర్‌ రామాలయంతో పాటు మిగిలిన ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. దుర్గానగర్‌ రామాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మంగవరం, పాల్తేరు, పీఎల్‌.పురం, నామవరం, గుంటపల్లి, అరట్లకోట, సత్యవరం, మాసాహెబ్‌పేట, పెంటకోట, గోపాలపట్నం, శ్రీరాంపురం, ఎస్‌.నర్సాపురంతోపాటు అన్ని గ్రామాల్లోనూ ఈ వేడులకు ఘనంగా జరిగాయి. 

నక్కపల్లి/ఎస్‌.రాయవరం : శ్రీరామ నవమి వేడుకలను నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో నేత్రపర్వంగా నిర్వహించారు.  నక్కపల్లి, వేంపాడు, ఉద్దండపురం, గొడిచెర్ల, గుల్లిపాడు, రేబాక, ఉపమాక, చందనాడ, అమలాపురం, నెల్లిపూడి, కాగిత, న్యాయంపూడి, పెదతీనార్ల, రాజయ్యపేట, ఎన్‌.నర్సాపురం గ్రామాల్లో ఈ వేడుకలు జరిగాయి. ఎస్‌.రాయవరం మండలం తిమ్మాపురం, ధర్మవరం, చినగమ్ములూరు, పెదగుమ్ములూరు, దార్లపూడి, ఎస్‌.రాయవరం, సైతారుపేట, లింగరాజుపాలెం, కర్రివానిపాలెం, గుడివాడ గ్రామాల్లో అట్టహాసంగా జరిపారు.



Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST