అంతా రామమయం

ABN , First Publish Date - 2021-04-22T05:21:56+05:30 IST

జిల్లాలో ఎక్కడ చూసినా అంత రామమయం అంటూ శ్రీరామదా సు కీర్తనలు మిన్నంటాయి. రామా లయాల్లో ఏకాంత పూజలు చేశా రు.

అంతా రామమయం
మైదుకూరు పార్వతీనగర్‌లో సీతారాముల కల్యాణం

ఏకాంత సేవలోనే ప్రత్యేక పూజలు

వేడుకగా కల్యాణోత్సవం

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

రాత్రి గ్రామోత్సవం 

 జిల్లాలో ఎక్కడ చూసినా అంత రామమయం అంటూ శ్రీరామదా సు కీర్తనలు మిన్నంటాయి. రామా లయాల్లో ఏకాంత పూజలు చేశా రు. చిన్న గ్రామమైనా సరే కనీసం రామమందిరమైనా నిర్మించే భక్తు లు అయోధ్య రామయ్య జన్మదినో త్సవమైన శ్రీరామ నవమి వేడుకల ను అత్యంత రమణీయంగా నిర్వ హిస్తారు. ఇందుకు గాను వారం ముందునుంచే పానకం, వడపప్పు పంపిణీ ఏర్పాటుకు సిద్ధమవు తారు. అయితే ప్రస్తుతం కరొనా నేపథ్యంలో ఏకాంత సేవతోనే శ్రీరా మ కల్యాణం నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో బండలాగుడు పోటీల ను నిర్వహించారు. విజేత వృషభ రాజముల యజమానులకు నిర్వా హకులు బహుమతులను అందిం చారు. వివరాల్లోకెళితే.....

గోపవరం, ఏప్రిల్‌21: శ్రీరామనవమి పండుగను గ్రామగ్రామాన భక్తులు ఆనందోత్సాహలతో చేసుకున్నారు. బుచ్చ నపల్లెలో పంచాయతీరాజ్‌ డీఈ నాగరా జు ఆఽధ్వర్యంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. నీరుద్రపల్లి, రాచా యపేట, బెడుసుపల్లె, గోపవరం గ్రామా ల్లో కల్యాణం జరగగా మిగిలిన గ్రామా ల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి గ్రామోత్సవాలు జరిగాయి. 

మైదుకూరులో... 

మైదుకూరు, ఏప్రిల్‌ 21: సీతారాముల కల్యాణోత్సవం పలు ఆలయాల్లో ఘనం గా నిర్వహించారు. శ్రీరామనవమి సంద ర్భంగా మైదుకూరు పట్టణం, మండలం లోని వనిపెంట, జీవీ సత్రం నంద్యాలం పేట తదితర ప్రతి గ్రామాల్లోని శ్రీరామ ఆలయాల్లో నిర్వహించారు.

భక్తులు ఇళ్ల ల్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా  శ్రీరాంనగర్‌, పార్వతీనగర్‌, వని పెంటలోని శ్రీ సోమేశ్వరస్వామి దేవ స్థా నంలో నిబంధనల మేరకు నిర్వాహకు ల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించా రు. భక్తులకు ప్రసాదాలు అందచేశారు. 

చాపాడులో... 

చాపాడు, ఏప్రిల్‌ 21: మండలంలోని  శ్రీరామ ఆలయాల్లో నవమి వేడుకలను ఘనంగా చేసుకున్నారు. రామాలయాల్లో సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేకం గా పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చాపాడు, నరహరిపురం, సిద్దారెడ్డిపల్లె, మరికొన్ని గ్రామాల్లో సీతా రాముల కల్యాణం జరిపించారు. స్వామి వారిని గ్రామాల్లో ఊరేగించారు. భక్తుల కు బెల్లం పానకం, పెసరబేడలు పంపి ణీ చేశారు. ప్రజలు సంతోషంగా పండు గను చేసుకున్నారు. 

దువ్వూరులో... 

దువ్వూరు, ఏప్రిల్‌ 21: శ్రీరామనవమి వేడుకలు మండల వ్యాప్తంగా  నిర్వ హించారు. స్థానిక శ్రీరామ మందిరం, పాత దువ్వూరులోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో కొవిడ్‌ నిబంధనల మేరకు తక్కువ మందితో కల్యాణోత్స వం నిర్వహించారు. పాశం ఎస్టేట్‌ గ్రూ పునకు చెందిన లక్ష్మీ నరసయ్య, రామ మోహన దంపతులు, చీదిరి వెంకటనర సింహ దంపతులు కల్యాణోత్సవం నిర్వ హించి అన్నదానం ఏర్పాటు చేశారు. చిన్నసింగన పల్లెలో నవమిని పురస్క రించుకుని బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు రసవత్తరం గా ముగిశాయి. విజేతలకు బహుమతు లు అందించారు. 

బ్రహ్మంగారి మఠంలో... 

బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్‌ 21: కొత్తూరు రామాలయంలో నవమి వేడుకలను నిర్వహించారు. ఉదయం స్వామివారికి సామూహిక పూజలు నిర్వహించారు.  కమిటీ సభ్యులు  భక్తులకు ప్రసాదాల ను అందజేశారు.

ఖాజీపేటలో....

ఖాజీపేట, ఏప్రిల్‌21: శ్రీరామనవమి వేడుకలు మండల ప్రజలు చేసుకున్నా రు. శ్రీరామ ఆలయాలను అలంకరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పానకం, వడపప్పు భక్తులకు పంచిపెట్టారు. వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణం వేద పండితుల ఆధ్వ ర్యంలో జరిపారు. ఉ్తపపవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. అలాగే ఆలయాల్లో భక్తులు భోజనాలు చేశారు.

వేంపల్లెలో...

వేంపల్లె, ఏప్రిల్‌ 21: మండలంలో శ్రీరామనవమి పండుగను వేడుకగా చేసుకున్నారు. రామాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు పానకం, వడపప్పు పంచిపె ట్టారు. గవిమల్లేశ్వరస్వామి, గౌరీదేవి ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రెడ్డయ్య కాలనీలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. జడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, మాజీ ఉపసర్పంచు కొత్తూరు రెడ్డ య్య ఆధ్వర్యంలో లక్రీడ్రా నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. 

వేములలో...

వేముల, ఏప్రిల్‌ 21: శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పానకం, పెసరపప్పు పం పిణీ చేశారు. పలు గ్రామాల్లో సీతారా ముల కల్యాణం నిర్వహించారు. 

పులివెందులలో...

పులివెందుల రూరల్‌, ఏప్రిల్‌ 21:  పులి వెందులలో నవమి వేడుకలు  చేసు కున్నారు. పట్టణ, గ్రామ పరిధి రా మా లయాలు, ఆంజనేయస్వామి ఆల యా ల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల సీతారాముల కల్యాణం జరి పించారు. శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరాము ల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం సీతారాముల కల్యాణం నిర్వహించారు. భక్తులు పానకం, వడ పప్పు తీర్థప్రసాదాలు అందుకున్నారు.







Updated Date - 2021-04-22T05:21:56+05:30 IST