ఈవీఎమ్‌లను పర్యవేక్షించాలి..

ABN , First Publish Date - 2021-06-20T05:53:39+05:30 IST

ఈవీఎమ్‌లను జాగ్రత్తల మధ్య తరలించి వాటిని ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర చీఫ్‌ ఎలకో్ట్రరల్‌ ఆఫీసర్‌ శశాంక గోయల్‌ సూచిం చారు.

ఈవీఎమ్‌లను పర్యవేక్షించాలి..
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

- రాష్ట్ర చీఫ్‌ ఎలకో్ట్రరల్‌ ఆఫీసర్‌ శశాంక గోయల్‌

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 19: ఈవీఎమ్‌లను జాగ్రత్తల మధ్య తరలించి వాటిని ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర చీఫ్‌ ఎలకో్ట్రరల్‌ ఆఫీసర్‌ శశాంక గోయల్‌ సూచిం చారు. శనివారం అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహిం చారు. ఈవీఎమ్‌లను ప్రతి నెలలో ఒక్కసారి పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. సంబంధించిన నివేదికను ప్రతినెల 5లోపు పంపించాలన్నారు. గోదాంల అంతర్గత పరిస్థితులను జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబర్‌ మాసాల్లో పరిశీలించాలన్నారు. కొత్తగా నిర్మించిన గోదాంలకు ఈవీఎమ్‌లను తరలించాలని సూచించారు. తరలింపు వివిధ రాజకీయ పార్టీలో సమక్షంలో జరగాలన్నారు. 2020-21లో జరిగిన ఎన్నికల ఖర్చుల నివేదికను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా నిర్మించిన గోదాంకు 1,668 ఈవీఎమ్‌లను తరలించినట్లు తెలిపారు. జిల్లాలో ఓటరు నమోదుకు కోసం 11,289 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 2526 తిరస్కరించినట్లు పేర్కొన్నారు. నూతనంగా నమోదు చేసుకున్న 704 మందికి ఓటరు కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఖర్చులను ఈనెల 17న పూర్తి చేసినట్లు వివరించారు. ఎన్నికల అధికారుల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉందని, వాటిని విడుదల చేయాల్సిందిగా కోరారు. ఓటరుల ప్రాముఖ్యతపై పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, నర్సింహమూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:53:39+05:30 IST