మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-28T05:56:28+05:30 IST

ప్రతి పౌరుడు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు.

మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలి
మొక్కను నాటుతున్న శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య


అద్దంకి, జూలై 27: ప్రతి పౌరుడు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం అద్దంకి నగరపంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక బంగ్లారోడ్డులో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటను న్నట్లు చెప్పారు. అద్దంకిలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్ర మంలో చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌ దేసు పద్మేష్‌, కమిషనర్‌ ఫజులుల్లా, వైసీపీ పట్టణ  అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, కౌన్సిలర్లు బాలు, కోటేశ్వరరావు, నాగరాజు, సుధీర్‌, అనంతలక్ష్మి, విజయలక్ష్మి, మేడం రమణ, సురేష్‌, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-28T05:56:28+05:30 IST