Former Chief Minister: వారి ఆత్మహత్యకు సీఎం బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2022-09-10T15:02:25+05:30 IST

‘నీట్‌’ భయం, ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వాటికిఇ ముఖ్యమంత్రి స్టాలిన్‌ బాధ్యత వహించాలని

Former Chief Minister: వారి ఆత్మహత్యకు సీఎం బాధ్యత వహించాలి

                                     - ప్రతపక్షనేత ఎడప్పాడి


పెరంబూర్‌(చెన్నై, సెప్టెంబరు 9: ‘నీట్‌’ భయం, ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వాటికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ బాధ్యత వహించాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, విద్యార్థుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేలా న్యాయపోరాటం చేసిన అన్నాడీఎంకే ప్రభుత్వం, మరోవైపు విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేసేలా ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే నీట్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన డీఎంకే, ప్రస్తుతం నీట్‌ రద్దుపై కల్లబొల్లి మాటలు చెబుతూ అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులను మభ్యపెడుతోందన్నారు. నీట్‌పై న్యాయపోరాటంతో పాటు అన్నాడీఎంకే(AIADMK) ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణా కేంద్రాల్లో మెరుగైన బోధన అందించేలా స్టాలిన్‌ చర్యలు చేపట్టాలని పళనిస్వామి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-09-10T15:02:25+05:30 IST