Former Chief Minister: ఆ పార్టీ పాలనలో రూ.20 వేల కోట్ల అవినీతి

ABN , First Publish Date - 2022-08-10T13:52:56+05:30 IST

డీఎంకే 14 నెలల పాలనలో రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi

Former Chief Minister: ఆ పార్టీ పాలనలో రూ.20 వేల కోట్ల అవినీతి

                            - ప్రతిపక్ష నేత ఎడప్పాడి ఆరోపణ


పెరంబూర్‌, ఆగస్టు 9: డీఎంకే 14 నెలల పాలనలో రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఆరోపించారు. సేలం నుంచి మంగళవారం ఉదయం చెన్నైకి బయల్దేరిన పళనిస్వామికి మార్గమధ్యలో కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. కడయాంపట్టిలో కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ, మంగళవాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నాడీఎంకే అమలుచేసిన సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు మరికొన్ని పథకాలకు పేర్లు మార్చి తాము ప్రవేశపెట్టినట్లు ప్రకటనలు గుప్పిస్తోందన్నారు. గతంలో కరుణానిధి, తర్వాత స్టాలిన్‌, తదుపరి ఉదయనిధి, భవిష్యత్తులో ఇన్బనిధి... ఇదేమైనా రాజకీయ పరంపరా? ఆ పార్టీలో మరెవ్వరినీ ముఖ్యమంత్రి(Chief Minister)ని కానివ్వరని ఆరోపించారు. ఆస్తి, విద్యుత్‌ చార్జీలు పెంపుతో డీఎంకే(DMK) ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పళనిస్వామి పేర్కొన్నారు.

Updated Date - 2022-08-10T13:52:56+05:30 IST