Petition: మాజీ ముఖ్యమంత్రి టెండర్ల అవినీతికి ఆధారాలున్నాయి

ABN , First Publish Date - 2022-08-21T14:54:50+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) టెండర్ల అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయని

Petition: మాజీ ముఖ్యమంత్రి టెండర్ల అవినీతికి ఆధారాలున్నాయి

                                  - అరప్పోర్‌ ఇయక్కం బదులు పిటిషన్‌


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 20: మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) టెండర్ల అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయని అరప్పోర్‌ ఇయక్కం మద్రాసు హైకోర్టులో బదులు పిటిషన్‌ దాఖలుచేసింది. అన్నాడీఎంకే హయాంలో 2016 నుంచి 2021 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో రహదారుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌లు తన బంధువులు, అనుచరులకు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.692 కోట్లు నష్టం ఏర్పడిందని, ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అవినీతి నిరోధక శాఖపై అరప్పోర్‌ ఇయక్కం ఫిర్యాదు చేసింది. అలాగే టెండర్లకు సంబంధించిన వివరాలు కూడా సదరు సంస్థ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఇలాంటి చర్యలు తన పరువు, ప్రతిష్టలను దెబ్బతీశాయని పేర్కొంటూ రూ.10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ అరప్పోర్‌ ఇయక్కం నిర్వాహకులు జయరాంవెంకటేష్‌, జాకీర్‌హుస్సేన్‌లపై ఎడప్పాడి పళనిస్వామి మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

Updated Date - 2022-08-21T14:54:50+05:30 IST