అధికారంలోకి వస్తే.. నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-04-26T17:03:03+05:30 IST

తాము అధికారంలోకి వస్తే జలవనరుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.

అధికారంలోకి వస్తే.. నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

                     - మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 


బంగారపేట(బెంగళూరు): తాము అధికారంలోకి వస్తే జలవనరుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. తాలూకాలోని బీమగానహళ్లిలో జేడీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన జనతా జలధార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘జనతా జలధార’ కార్యక్రమం ద్వారా నీరు వస్తుందా..? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, ఎత్తినహొళె, మహదాయి, మేకెదాటు, అప్పర్‌ కృష్ణ వంటి ప్రాజెక్టులను అమలు చేయడం తమ ఉద్దేశ్యమన్నారు. ఎత్తినహొళె పథకం ప్రకటించి ఏళ్లు గడిచినా ఇంతవరకు చుక్క నీరు రాలేదన్నారు. రెండు టీఎంసీల నీరు సేకరించి కోలారు, చిక్కబళ్లాపుర జి ల్లాలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. కే సీ వ్యాలీ మురుగునీటిని సంస్కరించి అందచేస్తూ ప్రచారం పొందుతున్నారన్నారు. మురికినీటిని పం టలకు వినియోగించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టుల కోసం రూ. 5 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు. మల్లేశ్‌బాబును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరాజు, మాలూరు రామేగౌడ, డాక్టర్‌ రమేశ్‌ తదితరులు ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ చౌడరెడ్డి, జడ్పీ మాజీ అధ్యక్షురాలు మంగమ్మ మునిస్వామి, సీఎంఆర్‌ శ్రీనాథ్‌, వడగూరు రాము పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-26T17:03:03+05:30 IST