
- Ex Cm Kumaraswami
బెంగళూరు: అభివృద్ధి విషయంలో ప్రజల మధ్య తారతమ్యం చూపడం దేశద్రోహం కిందికే వస్తుందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విరుచుకుపడ్డారు. బెంగళూరులో వర్షం కారణంగా దెబ్బతిన్న బ్యాటరాయనపుర, హెబ్బాళ, యలహంక శాసనసభ నియోజకవర్గాల్లో శనివారం ఆయన పర్యటించారు. యలహంకలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇంతవరకు ప్రజల సమస్యలు పట్టించుకునేందుకు అధికారులు రాకపోవడంపై ఆయన ఆ క్రోశం వ్యక్తం చేశారు. ఓ మతానికి చెందిన ప్రజలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో ఉద్దేశ్యపూర్వకంగానే మౌలిక సదుపాయా లు కల్పించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. యలహంక ఎమ్మెల్యే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సరికాదన్నారు. తనకు ఓట్లు వేయలేదన్న కారణంతోనే ప్రజలను టార్గెట్ చేస్తున్నారని ఇది సరికాదన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజల మధ్య తారతమ్యం చూపడం దేశద్రో హంకిందికే వస్తుందని, ముఖ్యమంత్రి బొమ్మై తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కుమారస్వామి వెంట మాజీ ఎమ్మెల్సీలు టీఏ శరవణ, రమేశ్‌గౌడ, జేడీఎస్ నగర విభాగం అధ్యక్షుడు ఆర్ ప్రకాశ్, యలహంక జేడీఎస్ అధ్యక్షుడు క్రిష్ణప్ప తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి