వచ్చే ఎన్నికల్లో Jdsకే ఎక్కువ సీట్లు

ABN , First Publish Date - 2022-07-03T15:58:44+05:30 IST

రానున్న శాసనసభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలకంటే ఎక్కువసీట్లు జేడీఎ్‌సకే వస్తాయని మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో Jdsకే ఎక్కువ సీట్లు

                                         - Ex Cm Kumaraswami


బెంగళూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలకంటే ఎక్కువసీట్లు జేడీఎ్‌సకే వస్తాయని మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కు 130 సీట్లు అని అంతర్గత సర్వేలో చెప్పుకుంటున్నారన్నారు. ప్లాంటెడ్‌ సమీక్షలో వారికి 60-65 సీట్లు దక్కనున్నాయని వివరించారు. 2013లో యడియూరప్ప మరో పార్టీ ఏర్పాటు చేయని పక్షంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యేవారు కాదన్నారు. సిద్దరామయ్య ఎప్పుడూ యడియూరప్పను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగి 78 స్థానాలకు పడిపోయారన్నారు. ఇప్పుడే సవాల్‌ చేస్తున్నానని కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాలు దాటే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీకి ప్రజలు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. రెండు జాతీయ పార్టీలకంటే ఎక్కువసీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేవెగౌడపై అనుచితంగా మాట్లాడిన రాజణ్ణ ఎస్టీ వర్గానికి చెందినవారని, ఆ వర్గానికి దేవెగౌడ చేసిందేమిటో సిద్దరామయ్యకు తెలుసన్నారు. 14 సీట్లు ఎస్టీ వర్గానికి ఇచ్చిన ఘనత దేవెగౌడదే అన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు ఉగ్రప్పకు కూడా తెలుసని, కానీ తుమకూరులో ఉంటూ అతడు చేసిందేమిటని ప్రశ్నించారు. తుమకూరులో అట్టడుగు వర్గాలకు శక్తిని ఇచ్చింది దేవెగౌడ అని, రిజర్వేషన్‌ వ్యవస్థ లేకున్నప్పుడు కూడా అవకాశాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యంతోనే బెంగళూరులో సమస్యలు తీవ్రమయ్యాయనే సీఎం బసవరాజ్‌ బొమ్మై వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. 2008-13 దాకా అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని, ఆ తర్వాత కాంగ్రెస్‌ అని, తాను 14 నెలలు మాత్రమే సీఎంగా ఉన్నానన్నారు. ఎవరు బెంగళూరుకు ఏం చేశారో పరిశీలిస్తే బాగుంటుందన్నారు. ఏదో ఒక కారణంతో దేవేగౌడ ఆయుష్షుపై మాట్లాడితే ఎటువంటి దుష్పరిణామం ఉండదన్నారు. చెడుగా ఆలోచించినంత మాత్రాన అన్నీ జరిగిపోవన్నారు. 

Updated Date - 2022-07-03T15:58:44+05:30 IST