Bjpలో లేదా వారసత్వ రాజకీయం..

ABN , First Publish Date - 2022-07-07T17:34:14+05:30 IST

జేడీఎస్‌ పార్టీ అంటే ఇటీవల అందరికీ చులకనగా మారిందని, ప్రతి ఒక్కరూ వారసత్వ రాజకీయం అంటూ మాట్లాడుతున్నారని బీజేపీలో అటువంటి

Bjpలో లేదా వారసత్వ రాజకీయం..

- ఈ జాబితాపై సమాధానం చెప్పండి

- ప్రధానికి మాజీ సీఎం కుమార ప్రశ్న 


బెంగళూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ పార్టీ అంటే ఇటీవల అందరికీ చులకనగా మారిందని, ప్రతి ఒక్కరూ వారసత్వ రాజకీయం అంటూ మాట్లాడుతున్నారని బీజేపీలో అటువంటి వారు లేరా..? అని జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన 20 కుటుంబాలు రా జకీయాల్లో ఉన్నాయని, వాటిపై ప్రధాని సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. బుధవారం బెంగళూరులో ఆయన తొలుత ట్వీట్లు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్న ఈ కు టుంబాల గురించి వివరించాలని జాబితా ప్రకటించారు. వారిలో యడియూరప్ప ము ఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన కుమారుడు రాఘవేంద్ర ఎంపీగా ఉన్నారని, మరో కుమారుడు విజయేంద్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఉన్నారని తెలిపారు. బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్య, ఆయన అన్నకొడుకు తేజస్వి సూర్య ఎంపీగా ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. జగదీశ్‌శెట్టర్‌ కుటుంబంలో ప్రదీ్‌పశెట్టర్‌ అదే విధంగా అరవింద లింబావళి - రఘు, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ - వాణీ విశ్వనాథ్‌, మురుగేశ్‌ నిరాణి - హనుమంత నిరాణి, జీఎస్‌ బసవరాజ్‌ - జ్యోతి గణేశ్‌, ఉమేశ్‌కత్తి కుటుంబం, శశికళా జొల్లె కుటుంబం, జార్కిహొళి కుటుంబం, శ్రీరాములు కుటుంబం, జనార్దన్‌రెడ్డి బ్రదర్స్‌, సురేశ్‌ అంగడి కుటుంబం, మంత్రి సోమణ్ణ కుమారుడు అరుణ్‌ సోమణ్ణ ఇలా 16 మం ది జాబితా ఇచ్చానని కావాలంటే మరింత మంది బీజేపీ వారసత్వ రాజకీయాల గురించి వివరిస్తానన్నారు. రాష్ట్రమంతటా కమల కుటుంబ వారసత్వంపై స్పష్టత ఇవ్వగలరా అని ప్రశ్నించారు. తరచూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వారసత్వ రాజకీయం అంటారని లేదంటే లక్కీడిప్‌ సీఎం అంటారని విరుచుకుపడ్డారు. ‘అవును నేను లక్కీడిప్‌ సీఎంనే. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రజాభిప్రాయంతో గెలిచినవారా..?’ అని ప్రశ్నించారు. లక్కీడిప్‌ అంటే తనకు అవమానం లేదని ఆపరేషన్‌ కమలకంటే ఇ దేమీ అధ్వానం కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచరించిన రోడ్లను పరిశీలిస్తే వారి అంకెల అవినీతి తెలుస్తుందన్నారు. మిషన్‌ దక్షిణ్‌ అర్థం ఏమిటన్నారు. మైసూరులో యోగాసనం, హైదరాబాద్‌లో కార్యవర్గ భేటీ రహస్యం తెలియనివారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-07-07T17:34:14+05:30 IST