ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-19T06:05:49+05:30 IST

పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీ రామారావు ఆశయ సాధనకు కృషి చేయాలని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు.

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల నివాళి

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని

వాడవాడలా ఎన్టీఆర్‌కు ఘన నివాళులు 

ఏలూరు టూటౌన్‌, జనవరి 18 : పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీ రామారావు ఆశయ సాధనకు కృషి చేయాలని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు  నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్‌ బాటలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీని ముందుకు తీసుకువెళ్లి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ఏలూరు అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, పుప్పాల జగదీష్‌బాబు, కొక్కిరిగడ్డ జయరాజు, దాసరి ఆంజనేయులు, చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్‌, బంకా రామ్మో హన్‌రావు, నాయుడు సోము, వందనాల శ్రీనివాసరావు, లంకపల్లి మాణిక్యాలరావు, కడియాల విజయలక్ష్మి, తవ్వా అరుణకుమారి, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. 

 ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. ముఖ్య అతిఽథులుగా గన్ని, బడేటి చంటి పాల్గొన్నారు. పేదలకు అన్నదానం చేశారు.

 ఏలూరు రూరల్‌ : ఎన్టీ రామారావు వర్ధంతిని మంగళవారం పాలగూడెంలో పార్టీ రూరల్‌ మండల మాజీ అధ్యక్షుడు నేతల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 

దెందులూరు : మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు యుగపురుషుడని దెందులూరు మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌ (మిల్లుబాబు) అన్నారు. దెందులూరులో ఎన్టీఆర్‌ 26వ వర్థంతి సందర్భంగా పార్టీ గ్రామ అధ్యక్షుడు యిప్పిలి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్‌ తోట ఏసమ్మ, ఎంపీటీసీ శేషారత్నం తదితరులు ఉన్నారు. శ్రీరామవరంలో మాజీ వైస్‌ ఎంపీపీ ఎం.నాని ఆధ్వర్యంలో, పోతు నూరులో పార్టీ గ్రామ అధ్యక్షుడు కోనేరు బాబి, బీసీ సెల్‌ అధ్యక్షుడు నున్న లక్ష్మణ్‌, యువత అధ్యక్షుడు జక్కుల ఆశబాబు ఆధ్వర్యంలో, కొవ్వలిలో పార్టీ గ్రామ అధ్యక్షుడు కసుకూర్తి రామకృష్ణ. మాజీ ఎంపీటీసీ నిట్టా రజనికుమారి, మోహన్‌కృష్ణ, వడ్లపట్ల పండు తదితరులు ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పెదవేగి : మహనీయుడు ఎన్‌టీ.రామారావు అని పెదవేగి సర్పంచ్‌ తాతా శ్రీరామ్మూర్తి అన్నారు. పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ, కంచెన మోహనరావు, యశ్వంత్‌, సుబ్బారావు తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. విజయరాయిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి స్థానిక నాయకులు నివాళులర్పించారు. పార్టీ నాయకులు దారిబోయిన సత్యనారాయణ, పెదర్ల రాంబాబు, రావిపాటి పిచ్చియ్య, బిర్లంగి పెద్దులు, ఈడ్పుగంటి సుందరయ్య, వీరంకి నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేగివాడలో ఎం.రవికుమార్‌,  కొనకళ్ల శివమణి, బొకినాల రాంబాబు, పంది సూర్యచంద్రరావు తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 

పెదపాడు :  కొక్కిరపాడులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు మోరు శ్రావణి, గుత్తా అనిల్‌, లావేటి శ్రీనివాసరావు, పావు లూరి రామారావు, బెక్కం శ్రీనివాసరావు పాల్గొన్నారు. కొణికిలో సర్పంచి పొట్లూరి యుగంధర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.

Updated Date - 2022-01-19T06:05:49+05:30 IST