ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జలప్రళయం

ABN , First Publish Date - 2022-05-20T16:54:03+05:30 IST

వాతావరణ శాఖ భారీ వర్ష సంకేతాలను ముందుగానే తెలిపినా ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాజధాని బెంగళూరు నగరంలో జలప్రళయం వచ్చిందని

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జలప్రళయం

- వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది

- మాజీ సీఎం కుమారస్వామి


బెంగళూరు: వాతావరణ శాఖ భారీ వర్ష సంకేతాలను ముందుగానే తెలిపినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాజధాని బెంగళూరు నగరంలో జలప్రళయం వచ్చిందని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన జేడీఎల్‌పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు పడ్డ ప్రతిసారి నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడపాల్సి వస్తోందన్నారు. భారీ వర్షంతో వేలాది ఇళ్లు నీటమునగడం బాధగా ఉందన్నారు. రాజధానిలో వర్షం నీటి కాలువల ఆధునికీకరణ గురించి ప్రభుత్వం ఏడాదికాలంగా చెబుతూనే ఉందని, ఇంతవరకు డీరపీఆర్‌ కూడా సిద్ధం కాలేదని, ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేమైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. వర్షపీడిత ప్రాంతాల్లో శుక్రవారం తాను పర్యటిస్తానని, తన వెంట పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని కుమారస్వామి తెలిపారు.

Updated Date - 2022-05-20T16:54:03+05:30 IST