ఏ మత గ్రంథానికీ వ్యతిరేకం కాదు: Ex Cm

ABN , First Publish Date - 2022-03-20T16:52:05+05:30 IST

భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ వంటి ఏ మత గ్రంథాలకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకం కానని ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెల్లడించారు. మంగళూరులో శనివారం ఆయన మీడియాతో

ఏ మత గ్రంథానికీ వ్యతిరేకం కాదు: Ex Cm

బెంగళూరు: భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ వంటి ఏ మత గ్రంథాలకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకం కానని ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెల్లడించారు. మంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనది భిన్నమైన సంస్కృతి కల్గిన దేశమన్నారు. సమైక్య జీవన విధానంలో ఉన్నామన్నారు. కాంగ్రెస్ ది సాఫ్ట్‌ లేదా హార్డ్‌ హిందూత్వ అనే విధానం కాదన్నారు. మేం హిందూ ధర్మంపై నమ్మకం కల్గినవారమన్నారు. అన్ని మతాలను సమానం గా గౌరవిస్తామన్నారు. పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. రాజ్యాంగపరంగా సెక్యులర్‌ విధానాలను నమ్ముతామన్నారు. భగవద్గీతతోపాటు ఖురాన్‌, బైబిల్‌ను విద్యార్థులకు నేర్పినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే విద్యార్థులకు అవసరమైనది గుణాత్మకమైన విద్య అనేది మరువరాదన్నారు. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్పించే అంశమై ప్రభుత్వం తీర్మానించలేదని, గుజరాత్‌లో చేశారని మాత్రమే వ్యాఖ్యానించారన్నారు. భగవద్గీత ఇళ్లలో పిల్లలకు చెబుతారని, రామాయణ, మహాభారతం వంటివాటిని పిల్లలకు నేర్పుతారన్నారు. నైతిక విద్య అవసరమని, కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండరాదన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఐవాన్‌ డిసౌజా, మాజీ మంత్రి రమానాథ రై తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-20T16:52:05+05:30 IST