Former CM: రోడ్లపై పడవల్లో తిరగాల్సి వచ్చింది...

ABN , First Publish Date - 2022-09-09T17:59:12+05:30 IST

రోడ్లలో పడవలలో తిరగాల్సి వచ్చిందని నగరంలో వర్షపు నీటి ద్వారా తలెత్తిన సమస్యను సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా

Former CM: రోడ్లపై పడవల్లో తిరగాల్సి వచ్చింది...

బెంగళూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రోడ్లలో పడవలలో తిరగాల్సి వచ్చిందని నగరంలో వర్షపు నీటి ద్వారా తలెత్తిన సమస్యను సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Leader of Opposition Siddaramaiah) మండిపడ్డారు. గురువారం మహదేవపుర, సర్జాపుర రోడ్‌తో పాటు వివిధ వరద ప్రభావిత ప్రాంతాలను సిద్దరామయ్య సందర్శించారు. రబ్బరు బోట్‌ల ద్వారా తిరిగిన ఆయన పలువురు బా ధితులను పరామర్శించారు. కేవలం రెండురోజుల వర్షానికే నగరంలోని పలుప్రాంతాలలో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. భారీగా వర్షం వచ్చిందని కానీ సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి పరిస్థితి తలెత్తేది కాదన్నారు. కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వకాలంలో రాజకాలువ ఆక్రమణల తొలగింపు ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. 1953 ఆక్రమణలు గుర్తించి 1300లకు పైగా తొలగించామన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు లేకుంటే ఇటువంటి ఉపద్రవాలు ఎదుర్కోక తప్పదన్నారు. ముఖ్యమంత్రి బొమ్మై గత పాలకుల నిర్వాకమేనని ఆరోపించారని కానీ ఆయన ఏడాది పాలనలో ఏం చేశారనేది వివరించాలన్నారు.

Updated Date - 2022-09-09T17:59:12+05:30 IST