
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ సీఎంను చూడాలన్నదే తన కోరిక అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టే ఆసక్తి తనకు లేదని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. 70 ఏళ్లు నిండిన వారికి అధ్యక్ష పదవి అవకాశం లేదని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మోదీ పాలనలో ఎమర్జెన్సీ అనే పదానికి అర్థం లేదన్నారు. ఎమర్జన్సీ కాలంలో రాజ్యాంగానికి ఇందిరాగాంధీ తూట్లు పొడిచారని విద్యాసాగర్‌రావు విమర్శించారు.