కర్నాటక బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు

ABN , First Publish Date - 2022-06-25T21:56:11+05:30 IST

కర్నాటక రాష్ట్రంలోని కాల బురగీ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద(bus accident) బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని(exgratia) మంజూరు చేసింది.

కర్నాటక బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు

హైదరాబాద్: కర్నాటక రాష్ట్రంలోని కాల బురగీ వద్ద  జరిగిన ఘోర బస్సు ప్రమాద(bus accident) బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని(exgratia) మంజూరు చేసింది. ఈ నెల 27 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) బాధిత కుటుంబాల సభ్యులకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేస్తారు. ఈ నెల 3 వ తేదీన జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో 7 గురు మృతి చెందగా, మరో 7 గురు తీవ్రంగా గాయపడ్డారు. 


బస్సు ప్రమాదం సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మృతులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాదంలో అల్వాల్ లోని రిసాల బజార్ కు చెందిన అర్జున్ కుమార్ మరణించగా, వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 24 లక్షల 50 వేల రూపాయలను మంజూరు చేసింది.

Updated Date - 2022-06-25T21:56:11+05:30 IST