
నంద్యాల జిల్లా : చాగలమర్రిలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. వైసీపీ నాయకులు మహిళపైన దాడి చేయడం హేయమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు సంవత్సరాల చిన్నారుల నుంచి వృద్ధులపై వైసీపీ నాయకులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం అంటూ దిశ యాప్ ను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన ఇస్టాల్ చేస్తున్నా... మహిళలకు ఎంత వరకు న్యాయం జరుగుతుందో చూస్తామన్నారు. నిన్న రాత్రి మహిళలపై జరిగిన దాడిలో గాయపడిన వారికి న్యాయం జరిగితే స్వయాన తానే దిశ యాప్ వల్ల మహిళలకు రక్షణ ఉంటుందని చెబుతానని అఖిలప్రియ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి