నెల్లూరు: నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో హత్యలు, అరాచకాలు జరిగిపోతున్నాయని నారా లోకేష్ ఆరోపించారని, టీడీపీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరులో టీడీపీ నాయకులు రెండు మర్డర్లు చేయలేదా? అని ప్రశ్నించారు. సంతపేటలో జరిగిన మర్డర్ కేసులో A1 నిందితుడితో ప్రెస్ మీట్ పెట్టించుకునే అరాచక పార్టీ TDP అని అనిల్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రెండు రాజకీయ హత్యలు జరిగాయని పేర్కొన్నారు.