Ex Minister Comments: ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

ABN , First Publish Date - 2022-07-24T14:35:11+05:30 IST

ఎన్నికల హామీలు నెరవేర్చని డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి(Ex Minister) పి.బెంజిమెన్‌

Ex Minister Comments: ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

                                     - మాజీ మంత్రి బెంజిమెన్‌


ప్యారీస్‌(చెన్నై), జూలై 23: ఎన్నికల హామీలు నెరవేర్చని డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి(Ex Minister) పి.బెంజిమెన్‌ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రిసీడియం కార్యదర్శిగా ఎంపికైన సందర్భంగా బెంజిమెన్‌ను తిరువళ్లూర్‌ సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ విల్లివాక్కం పశ్చిమ రీజియన్‌ నిర్వాహకులు మనోహరన్‌, ఇళయరాజా(Ilayaraja), అన్బు, కేశవన్‌ సహా జయలలిత పేరవై, అన్నా కార్మిక సంఘం నిర్వాహకులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బెంజిమెన్‌(Benjimen) మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రిసీడియం కార్యదర్శిగా  పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేయనున్నట్లు తెలిపారు. డీఎంకే(Dmk) పాలనా తీరును ఖండిస్తూ వచ్చే 25న తిరువళ్లూర్‌ జిల్లాలో ఆందోళన చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-07-24T14:35:11+05:30 IST