
ప్రకాశం: పీపీఏల రద్దు వల్లే రూ.20 పెట్టి విద్యుత్ కొనుగోలు చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ కారణంగానే కరెంటు చార్జీలు పెంచారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పాలనలో సీఎం జగన్ ఫెయిలయ్యాడని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గడపగడపకు వెళ్తుంటే జనం చీకొడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారని, అయితే జగన్ దుర్మార్గపు చర్యలు వల్ల కంపెనీలు తిరిగి వెళ్లిపోయే దుస్థితి వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి