Andhra Pradesh: పోలవరం నిర్మాణంపై CM Jagan నోరువిప్పాలి: మాజీ మంత్రి దేవినేని

ABN , First Publish Date - 2022-05-18T22:24:36+05:30 IST

పోలవరం నిర్మాణంపై CM Jagan నోరువిప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు.

Andhra Pradesh: పోలవరం నిర్మాణంపై CM Jagan నోరువిప్పాలి: మాజీ మంత్రి దేవినేని

Amaravathi: పోలవరం నిర్మాణంపై CM Jagan నోరువిప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రి Ambati Ram Babuతో పిచ్చిమాటలు మాట్లాడిస్తే సరిపోదని, చంద్రబాబుని, దేవినేని ఉమాని తిడితే పోలవరం పూర్తికాదన్నారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం, డబ్బు వ్యామోహం, తెలివి తక్కువతనం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపాలుగా మారాయన్నారు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు తగ్గిస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరుతెరవలేదని, పోలవరం నిర్మాణంపై పొరుగు రాష్ట్ర వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి అసమర్థతకాదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రూ.55,548 కోట్లకు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఆమోదం పొందితే, ఇప్పుడు వెదిరే శ్రీరామ్ రూ.9వేల కోట్లు చాలంటే విజయసాయిరెడ్డి మూసుక్కూర్చున్నాడని చెప్పారు. సీబీఐ, ఈడీ కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా? ప్రధానమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి ఎందుకు రూ.55,548కోట్లు సాధించలేకపోతున్నాడని ప్రశ్నించారు. పులిచింతల గేట్ కొట్టుకుపోయి నెలరోజులైతే ఏం చేస్తున్నావు అని రాంబాబుని ప్రశ్నించారు. మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ పూర్తిచేశారా? 6 ప్రాధాన్యతా ప్రాజెక్ట్ ల్లో ఎన్నిపూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-18T22:24:36+05:30 IST