‘పోలీసులు కేసు నమోదు చేయలేదు’

ABN , First Publish Date - 2022-06-03T17:57:20+05:30 IST

ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఢిల్లీ పోలీసులకు జాతీయ జెండాను అవమానించారని ఫిర్యాదు చేశారని అంతకు మించి ప్రస్తుతానికి

‘పోలీసులు కేసు నమోదు చేయలేదు’

                       - Ex Minister ఈశ్వరప్ప


బెంగళూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఢిల్లీ పోలీసులకు జాతీయ జెండాను అవమానించారని ఫిర్యాదు చేశారని అంతకుమించి ప్రస్తుతానికి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వెల్లడించారు. గురువారం ఆయన శివమొగ్గలో మీడియాతో మాట్లాడుతూ జాతీయ జెండాను అవమానించలేదన్నారు. జాతీయ జెండాకు అవమానం చేసేవారు దేశద్రోహులన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌ అబద్దాలు చెప్పారని ఇదే అంశంపై శాసనసభలో పోరాటం చేశారన్నారు. నా విషయాలను సాకుగా చూపుకుని డీకే శివకుమార్‌ ప్రచారాలు చేసుకున్నారన్నారు. తివర్ణ పతాకం జాతీయ జెండా అన్నారు. కానీ భవిష్యత్తులో భగవత్‌ధ్వజ ఎర్రకోటపై ఎగువచ్చునని మాత్రమే అన్నట్లు వివరించారు. ఇదే విషయమై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారని కానీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదన్నారు. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే అన్నారు. కాంగ్రెస్ లో డీకే శివకుమార్‌, సిద్దరామయ్యలు సీఎం రేసులో ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సిద్దరామయ్య ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదన్నారు. సిద్దరామయ్య ఆర్‌ఎస్ఎస్‌ పట్ల పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఈవిషయంలో ఎల్‌కేజీ స్టూడెంట్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యసభలో రెండోస్థానంకు అవకాశం లేకున్నా మైనార్టీ అభ్యర్థి మన్సూర్‌చేత నామినేషన్‌ వేయించి మైనార్టీలను అవమానం చేశారన్నారు.

Updated Date - 2022-06-03T17:57:20+05:30 IST