Ex Ministerకి హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-06-28T15:53:19+05:30 IST

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నై, కోయంబత్తూరు నగర

Ex Ministerకి హైకోర్టులో చుక్కెదురు

                        - అవినీతి కేసుల విచారణపై స్టేకు నిరాకరణ


అడయార్‌(చెన్నై), జూన్‌ 27: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నై, కోయంబత్తూరు నగర పాలక సంస్థల అభివృద్ధి నిర్మాణ పనుల కోసం ఆహ్వానించిన టెండర్లలో భారీగా అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల విచారణపై స్టే విధించాలని కోరుతూ ఎస్పీ వేలుమణి చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసుల విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. టెండర్లలో జరిగిన అవినీతిపై మాజీ మంత్రి వేలుమణికి వ్యతిరేకంగా డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌ఎ్‌స.భారతి హైకోర్టులో గతంలో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారీ, జస్టిస్‌ మాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అయితే తనకు వ్యతిరేకంగా సాగుతున్న విచారణపై స్టే విధించాలని కోరుతూ ఎస్పీ వేలుమణి చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. స్టేకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2022-06-28T15:53:19+05:30 IST