
- మాజీ మంత్రి జయకుమార్
పెరంబూర్(చెన్నై), జూన్ 4: డీఎంకే ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోరపరాజయం తప్పదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారం కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మాజీ మంత్రి డి.జయకుమార్ అన్నారు. స్థానిక రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాలిగైలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ అధికమవుతున్న నేరాలు, హత్య రాజకీయాలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే దిశగా పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి