ఆయన నియామకాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు...

Published: Tue, 05 Jul 2022 09:11:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆయన నియామకాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు...

                        - మాజీ మంత్రి కేపీ మునుస్వామి


వేలూరు(చెన్నై), జూలై 4: అనుకున్న విధంగానే అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఈ నెల 11న జరుగుతుందని, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శి కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ఉప సమన్వయకర్త కేపీ మునుస్వామి జోస్యం చెప్పారు. కాట్పాడి రైల్వే వంతెన అనుమతి లేకుండా ప్రారంభించిన వ్యవహారంలో అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి అప్పు వేలూరు సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. సోమవారం వేలూరు జైలుకు వెళ్లిన కేపీ మునుస్వామి అతడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, ప్రజల సమస్యల కొరకు ప్రతిపక్ష పార్టీగా పోరాడుతామని మునుస్వామి తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.