సీఎం జగన్‌ను చరిత్ర క్షమించదు

Published: Sun, 27 Mar 2022 23:22:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీఎం జగన్‌ను చరిత్ర క్షమించదుమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

మాజీమంత్రి ప్రత్తిపాటి 

చిలకలూరిపేట, మార్చి 27: అమరావతి రాజధాని విషయంలో మాట తప్పి మడమ తిప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు. చిలకలూరిపేటలోని తన నివాసగృహంలో ప్రత్తిపాటి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే సీఎం సీట్లో కూర్చున్న జగన్‌మోహన్‌రెడ్డి అదే వ్యవస్థల మీద దాడి చేయడం దారుణమన్నారు. విభజన చట్టాన్ని వక్రీకరించి శాసనవ్యవస్థకు అధికారాలు లేవా అంటూ వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను మోసం చేస్తే జగన్‌రెడ్డిని చరిత్ర క్షమించదన్నారు. గతంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని 30వేల ఎకరాలు కావాలంటూ అసెంబ్లీలో ఒప్పుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. కేంద్రంతో లోపాయికారిగా వ్యవహరిస్తున్న జగన్‌ శాసనవ్యవస్థకు అధికారం వచ్చేలా చట్టాన్ని తెచ్చుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు డబ్బులు ఇవ్వని కారణంగా వేలాది కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. రూ.48వేల కోట్లకు లెక్కలు లేవని కాగ్‌ తప్పు పట్టినా సమాధానం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో జే బ్రాండ్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఇంత ధనదాహం ఉన్న సీఎం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరూ లేరన్నారు.

  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.