ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు : ప్రత్తిపాటి

ABN , First Publish Date - 2022-05-16T05:31:42+05:30 IST

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజాసమస్యలపై పోరాటం ఆపేది లేదని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు : ప్రత్తిపాటి
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మే 15: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజాసమస్యలపై పోరాటం ఆపేది లేదని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్టీఆర్‌ సుజల ప్లాంటు వద్ద జరిగిన వివాదంపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో ప్రత్తిపాటిని అరెస్టు చేస్తారన్న ఊహాగానాలతో శనివారం అర్థరాత్రి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున పట్టణంలోని ఆయన నివాసగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాన్ని పునఃప్రారంభిస్తే ఎక్కడ తమకు మంచి పేరు వస్తుందోననే భయంతో తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. రోజుకు 25వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పథకంలో పట్టణంలో సుమారు 25వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానని ధైర్యం చెప్పారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దాసరి రాజామాస్టారు, నియోజకవర్గ పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రత్తిపాటి నివాసానికి ఆదివారం కూడా పెద్దఎత్తున చేరుకుని ప్రత్తిపాటికి మద్దతు తెలిపారు. కాగా.. ప్రత్తిపాటిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసు తక్షణమే ఎత్తివేయాలని నవతరంపార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును శనివారం ఆయన నివాసగృహంలో పరామర్శించారు. ప్రత్తిపాటిపై  అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు.  

   

Updated Date - 2022-05-16T05:31:42+05:30 IST