రైతుల విషయంలో కేంద్ర ప్రయత్నాలు సాగవు: వడ్డేశోభనాద్రీశ్వరరావు

ABN , First Publish Date - 2020-12-02T17:46:48+05:30 IST

రైతుల విషయంలో కేంద్ర ప్రయత్నాలు సాగవు: వడ్డేశోభనాద్రీశ్వరరావు

రైతుల విషయంలో కేంద్ర ప్రయత్నాలు సాగవు: వడ్డేశోభనాద్రీశ్వరరావు

విజయవాడ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆందోళన చేస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రైతు సంఘాలతో సమావేశం అయిన కేంద్ర ప్రభుత్వం.. అంశాలను పరిశీలిస్తామని చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు. రైతు సంఘాలలో చీలిక తేవాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు. దాదాపు 5 వందల సంఘాలు ఉన్నాయని.. అందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని సంఘాలను మాత్రమే పిలిచి రైతులలో చీలిక తేవడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని అబద్ధాలు చెబుతూ రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. 


2015లో లక్ష మంది రైతులతో ఢిల్లీ కో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, రుణమాఫీ చేయాలని ప్రైవేట్ బిల్లులను పెట్టినా స్పందించలేదని విమర్శించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని అన్నారు. 3న రైతుల ఉద్యమానికి మద్దతుగా రాస్తా రోకో ,4న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 5న అన్ని కార్మిక సంఘాలతో నిరసనలు తెలపాలని పిలుపునిస్తున్నామన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే వ్యవసాయ చట్టాలను తీసుజువచ్చారని వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2020-12-02T17:46:48+05:30 IST