ఎన్నికల్లో ఓటమికి ద్వంద్వ నాయకత్వమే కారణం

ABN , First Publish Date - 2022-06-29T15:17:04+05:30 IST

గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయానికి ప్రధాన కారణం తమ పార్టీలోని ద్వంద్వ నాయకత్వమేనని మాజీ మంత్రి పి.వళర్మతి విమర్శించారు. ఆమె

ఎన్నికల్లో ఓటమికి ద్వంద్వ నాయకత్వమే కారణం

                               - Ex Minister వళర్మతి 


అడయార్‌(చెన్నై), జూన్‌ 28: గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయానికి ప్రధాన కారణం తమ పార్టీలోని ద్వంద్వ నాయకత్వమేనని మాజీ మంత్రి పి.వళర్మతి విమర్శించారు. ఆమె మంగళవారం తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో ఎవరు సంబంధం పెట్టుకున్నా వారిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలన్నదే అన్నాడీఎంకే సిద్ధాంతమన్నారు. కానీ, పార్టీ కన్వీనర్‌ ఒ.పన్నీర్‌సెల్వం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌పై పొగడ్తల వర్షం కురిపించారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోవడానికి, డీఎంకే విజయానికి ప్రధాన కారణం ద్వంద్వ నాయకత్వమేన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే తిరిగి విజయం సాధించాలంటే ఏక నాయకత్వం కావాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారని అన్నారు. అందువల్ల ఎడప్పాడి పళనిస్వామికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్నదే ప్రతి ఒక్కరి అభీష్టమన్నారు. పార్టీ నుంచి పన్నీర్‌సెల్వంను బహిష్కరించాలంటూ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఒకవేళ అదే జరిగితే పన్నీర్‌సెల్వం ఖచ్చితంగా కాషాయం కండువా కప్పుకుంటారని ఆమో జోస్యం చెప్పారు. అన్నాడీఎంకేను సాఫీగా ముందుకు తీసుకెళ్ళాలన్నా, రాష్ట్రంలో తిరిగి జయలలిత పాలన రావాలన్నా ఎడప్పాడి పళనిస్వామికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఆమె సూచించారు. 

Updated Date - 2022-06-29T15:17:04+05:30 IST