ACB inspections: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-14T16:09:49+05:30 IST

నామక్కల్‌ అన్నాడీఎంకే(AIADMK) మాజీ ఎమ్మెల్యే((Former MLA)) కేపీపీ భాస్కర్‌ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఏసీబీ

ACB inspections: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన తనిఖీలు

                             - 214 ఆస్తుల పత్రాలు స్వాధీనం


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 13: నామక్కల్‌ అన్నాడీఎంకే(AIADMK) మాజీ ఎమ్మెల్యే((Former MLA)) కేపీపీ భాస్కర్‌ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లల్లో చేపట్టిన తనిఖీలు ముగిశాయి. మొత్తం 26 ప్రాంతాల్లో తనిఖీలు పూర్తయ్యాక భాస్కర్‌ ఇంట్లో 1.680 కిలోల బంగారం, 6.625 కిలోల వెండి, నాలుగు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ.20 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు, విదేశీ కరెన్సీ, కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులకు సంబంధించిన 200 దస్తావేజులు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, రూ.14,96,900 నగదు నామక్కల్‌ జిల్లా ఏసీబీ అధికారులు(ACB officials) స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభించిన తనిఖీలు శనివారం కూడా కొనసాగాయి. నామక్కల్‌ అశోక్‌నగర్‌లో ఉన్న భాస్కర్‌ ఇల్లు, మద్దతుదారులు మయిల్‌సుందరం, శేఖర్‌, గోపి, పారిశ్రామికవేత్తలు కార్తి, సురేష్‌, హోటల్‌ యజమాని లోకేష్‌ నివాసాల సహా మొత్తం 30 ప్రాంతాల్లో పోలీసుల భద్రత నడుమ తనిఖీలు జరిగాయి. 

Updated Date - 2022-08-14T16:09:49+05:30 IST