ఆర్బీకేలు.. రైతు భక్షక కేంద్రాలు

ABN , First Publish Date - 2022-05-16T05:28:22+05:30 IST

ఆర్బీకేల ద్వారా కనీసం విత్తనాలు సరఫరా చేయలేదని, రైతులకు పురుగు మందులు అందుబాటులో ఉంచలేదని, అవి రైతు భరసా కేంద్రాలు కాదని, రైతు భక్షక కేంద్రాలని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయలు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్బీకేలు.. రైతు భక్షక కేంద్రాలు
జీవీ ఆంజనేయులు

నరసరావుపేట టౌన్‌, మే 15: ఆర్బీకేల ద్వారా కనీసం విత్తనాలు సరఫరా చేయలేదని, రైతులకు పురుగు మందులు అందుబాటులో ఉంచలేదని, అవి రైతు భరసా కేంద్రాలు కాదని, రైతు భక్షక కేంద్రాలని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయలు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి గింజా ధాన్యం కొంటాం, రవాణా ఖర్చులు మావే, గోతాలు మావే అంటూ ఆర్బీకేల వద్ద ఆర్భాటపు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 49 లక్షల మెట్రిక్‌ టన్నుల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామంటున్నారని, ఏ ఆర్బీకే ద్వారా ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. కనీస మద్దతు ధరప్రకారం 75 కేజీ బస్తాకి రూ.1,560 రైతుకు లభించాలని, కానీ రైతులు నిస్సహాయ స్థితిలో రూ.1,100, రూ.1,200కి బయట అమ్ముకున్నారని చెప్పారు. ఆర్డీకేలతో వైసీపీ నాయకులకు సంబంధించిన దళారులు, మిల్లర్లు బాగుపడుతున్నారు తప్ప రైతులకు ఒరిగిన ప్రయోజనం శూన్యం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము విత్తనాల కోసం రూ.300 కోట్లు పైగా ఖర్చుపెట్టామని, యాంత్రీకరణ కోసం ఏడాదికి రూ.500 కోట్లు, మైక్రో ఇరిగేషన్‌కు రూ.1,200కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వైసీపీ మూడేళ్ల పాలనలో వ్యవసాయం కోసం మీరెంత ఖర్చుపెట్టారో చెప్పగలరా అని ప్రశ్నించారు.


Updated Date - 2022-05-16T05:28:22+05:30 IST