ఆదాయం పెంపే దశలవారీ నిషేధమా?

ABN , First Publish Date - 2022-01-20T05:44:05+05:30 IST

టార్గెట్లు పెట్టి మద్యం ఆదాయం పెంచుకోవడమే దశలవారీ మద్యపాన నిషేధమా.. అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

ఆదాయం పెంపే దశలవారీ నిషేధమా?
జీవీ ఆంజనేయులు

విక్రయాలు పెంచుకునేందుకు గంట పొడిగింపు  

ప్రభుత్వ మద్యం పాలసీపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం

గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): టార్గెట్లు పెట్టి మద్యం ఆదాయం పెంచుకోవడమే దశలవారీ మద్యపాన నిషేధమా.. అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగించి కరోనా వ్యాప్తికి ప్రభుత్వం దారి చూపిందన్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం దారుణమన్నారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై నియంత్రణ విధిస్తుంటే రాష్ట్రంలో మాత్రం  మరింతగా అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని విమర్శించారు. అవినీత, అజ్ఞానం, అహంకారం కలిస్తే సీఎం జగన్‌ అని మరోసారి రుజవైందని తెలిపారు. ధరలు పెంచితే మద్యం మానేస్తారని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడేందుకు ధరలు తగ్గించిందని నిలదీశారు. ప్రజల ఆరోగాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మద్యం విక్రయాల సమయం పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-20T05:44:05+05:30 IST