జగన్‌వి అన్నీ గాలి మాటలే: జలీల్ ఖాన్

ABN , First Publish Date - 2022-01-23T01:54:33+05:30 IST

జగన్‌వి అన్నీ గాలి మాటలే..గాలి పనులేనని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల చేస్తున్న పీఆర్సీ ఉద్యమంపై..

జగన్‌వి అన్నీ గాలి మాటలే: జలీల్ ఖాన్

విజయవాడ: జగన్‌వి అన్నీ గాలి మాటలేనని..గాలి పనులేనని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ విమర్శించారు.  ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పీఆర్సీ ఉద్యమంపై ఆయన స్పందించారు.  ఏ ప్రభుత్వమూ ఇన్ని జీవోలు ఇచ్చి వెనక్కి ఉపసంహరించుకోలేదని,  ఓటేసిన ఉద్యోగులను కూడా జగన్ రోడ్డున పడేశారని ఎద్దేవా చేశారు. గుడివాడలో కేసినో వ్యవహారంపై టీడీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి కేసులకు తాము భయపడమని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-23T01:54:33+05:30 IST