ఇచ్చింది గోరంత.. ప్రచారం కొండంత

ABN , First Publish Date - 2021-07-24T04:58:53+05:30 IST

రాష్ట్రంలో కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా విదేశీ ఉన్నత విద్యకు అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు.

ఇచ్చింది గోరంత.. ప్రచారం కొండంత
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ 

క్రోసూరు, జూలై 23: రాష్ట్రంలో కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా విదేశీ ఉన్నత విద్యకు అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం గుంటూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన పదిశాతం రిజర్వేషన్‌లో ఐదుశాతం కాపులకు కేటాయించింది తమ ప్రభుత్వమేనన్నారు. తెలుగుదేశం పార్టీ కేటాయించిన ఐదుశాతం రిజర్వేషన్లు రద్దు చేసి కాపుల వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వంవారికి తామే ఏదో ఒరగబెట్టినట్టుగా కాపునేస్తం రెండో విడత అనే ప్రచారాలు చేసుకుంటోందన్నారు. రెండేళ్ల కాలంలో కాపు కార్పొరేషన్‌ ద్వారా కేవలం రూ.981 కోట్లు మాత్రమే ఇచ్చారని, రూ.12,126 కోట్లు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఇది అవాస్తవమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ ద్వారా సంవత్సరానికి రూ.700 కోట్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. సమావేశంలో నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నలజాల సదాశివరావు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఏపూరి నాగేశ్వరరావు, కాపు సంఘం నాయకులు ఏపూరి శ్రీనివాసరావు, ఇక్కుర్తి పేరయ్య, తిమ్మిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T04:58:53+05:30 IST