అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ కోన

ABN , First Publish Date - 2022-08-08T06:00:19+05:30 IST

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అవినీతి, అక్రమా లకు కేరాఫ్‌గా నిలిచాడని, ప్ర తి పనికి రేటు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రజలను భయపెడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.

అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ కోన
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అన్నం సతీష్‌ ప్రభాకర్‌






ప్రతి పనికీ ఓ రేటు.. ఇవ్వకుంటే బెదిరింపులు

ఇక ఎంతమాత్రం సహించేది లేదు

బాపట్ల బిడ్డగా.. ప్రజలకు అండగా ఉంటా

మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌

బాపట్ల, ఆగస్టు 7: బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అవినీతి, అక్రమా లకు కేరాఫ్‌గా నిలిచాడని, ప్రతి పనికి రేటు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రజలను భయపెడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.  బాపట్ల పట్టణంలోని కాపు కల్యాణ మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకట రమణతో కలిసి అన్నం సతీష్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నం మాట్లాడుతూ మూడేళ్లల్లో బాపట్లలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపీడీలు ఇంత వరకు ఏ ప్రభుత్వంలో జరగలేదన్నారు. ప్రతి పనికి ఓరేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడటం, ఇవ్వకపోతే అనుచర గణంతో బెదిరించడం, భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడున్నాడని, ఈ విషయంలో ప్రజలూ అయన అరాచకాలకు ఎదురు నిలబడలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునే వారి నుంచి ఎకరానికి రూ.10 లక్షలు, 200 గజాలు విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారి నుంచి రూ. 2లక్షలు డిమాండ్‌ చేయటం, ఎకరం పొలంలో లే అవుట్‌ వేయాలంటే అనుమతులు, మెరక చేయటం మొత్తం బాధ్యత మాదేనని రూ.25 లక్షల చొప్పున వసూళు చేయటం అతి దారుణమన్నారు. ఎన్నికలల్లో గెలవడానికి రూ. 100 కోట్ల ఖర్చు పెట్టాను.. ఇప్పుడు రూ.1000 కోట్లు సంపాదించాలి’ అని ఎడాపెడా ప్రజలపై పెడితే ఊరుకునేదిలేదన్నారు. ప్రజల ఆయనను రెండుసార్లు గెలిపించింది వారిపట్ల రౌడీలా, గుండాలా వ్యవహరించటం కోసం కాదని ద్వజమెత్తారు.  టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో ఏ ఎమ్మెల్యే  ఇంతట దారుణాలకు ఒడిగట్టలేదన్నారు. బాపట్లలో బతకాలంటే ఎమ్మెల్మే పర్మిషన్‌ కావాలా..? ఎమ్మెల్యే బయలుదేరితే అన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆపేయాలా దీనికి అధికారులు ఒత్తాసు పలకటం సబబేనా? అని ప్రశ్నించారు. గతంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, గాదె వెంకటరెడ్డి, పనబాకలక్ష్మీలు మంత్రులుగా పనిచేశారే తప్ప ఈవిధంగా చేయలేదన్నారు.  రోడ్లు విస్తీర్ణం పేరిట వ్యాపారుల దుకాణాలను  ఇష్టానుసారంగా పడగొట్టటం, అడిగితే బెదిరించటం దారుణమన్నారు. అధికారులు కోన అక్రమాలకు వత్తాసు పలుకుతూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూళ్ళు చేస్తే ఏసీబీ వారికి ఆధారాలతో పట్టిస్తానని హెచ్చరించారు. ప్రజలు తమకు జరిగే అన్యాయాన్ని తన దృష్టికి తీసుకురావాలని కోరారు. భావదేవుని ఆలయ రథ నిర్మాణానికి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రూ.15 లక్షల రూపాయలు అధికారులకు తానిస్తే ఎమ్మెల్యే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వలేదని ఆ డబ్బులు రథానికి కాకుండా ప్రహరీ నిర్మాణానికి లేదా గోశాలకో వాడుతానని సోషల్‌ మీడియాలో పెట్టించటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే చుట్టూ ఉండే వైసీపీ నాయకులే ఆయన దుర్మార్గాలను ఎండగడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈనెల 11న బాపట్ల వస్తున్న సీఎంను కలిసి కోన అక్రమాలను ఆధారాలతో సహా వివరిస్తానన్నారు. లేకుంటే తాడేపల్లి వెళ్ళి మరి చెప్పివస్తానన్నారు. ఇక కోన చేస్తున్న దుర్మార్గాలను ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదన్నారు. బాపట్లకు మరోసారి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్‌, అర్హత కోనాకు ఇక లేదన్నారు. తనకు ప్రాణం ఉన్నంత వరకు బాపట్ల బిడ్డగా ప్రజలకు అండగా ఉంటానన్నారు. మూడేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రన చేతగాని తనం అనుకోవటం కోన అవివేకానికి నిదర్శనమన్నారు. అన్యాయాన్ని ఎదుర్కొవడానికి, ప్రజలకు అండగా ఉంటానికి తనకు ఎమ్మెల్యే పదవులేమి అవసరం లేదన్నారు.  


Updated Date - 2022-08-08T06:00:19+05:30 IST