మాజీ ఎంపీ కవిత ఔదార్యం.. క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న గల్ప్‌ కార్మికులకు..

ABN , First Publish Date - 2020-07-06T20:29:03+05:30 IST

క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న గల్ఫ్‌ కార్మి కుల పట్ల మాజీ ఎంపీ కవిత ఔదార్యం చూపారు. వారం రోజుల పాటు హైదరాబాద్‌ ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న

మాజీ ఎంపీ కవిత ఔదార్యం.. క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న గల్ప్‌ కార్మికులకు..

నిజామాబాద్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న గల్ఫ్‌ కార్మి కుల పట్ల మాజీ ఎంపీ కవిత ఔదార్యం చూపారు. వారం రోజుల పాటు హైదరాబాద్‌ ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన 153 మంది గల్ఫ్‌ కార్మికులను నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి జగిత్యాలకు నాలుగు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఆదివారం స్వస్థలాలకు పంపా రు. గత నెల 27న జాగృతి సహకారంతో హైదరాబాద్‌ చేరుకున్న గల్ఫ్‌ కార్మికులు క్వారంటైన్‌ పూర్తిచేసుకొని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేసి మరోమారు తన ఔధార్యాన్ని చాటుకున్నారు. 


బెహరాన్‌ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు వరికుంట బాబు బెహరాన్‌లో ఉన్న గల్ఫ్‌ కార్మికులను వివిధ శాఖల ప్రతినిధులను సమన్వయరిచి స్వస్థలాలకు తీసుకువచ్చారు. వీరిలో ఆర్మూర్‌కు చెందిన 43 మంది, కామారెడ్డికి చెందిన 35 మంది, జగిత్యాలకు చెందిన 31 మంది, నిజామాబాద్‌కు చెందిన 41 మంది గల్ఫ్‌ కార్మికులు ఉన్నారు. వీరిని హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన ప్రత్యేక బ స్సుల్లో స్వస్థలాలకు పంపారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు సహకరించిన మాజీ ఎంపీ కవితకు గల్ఫ్‌ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏర్పాట్లలో తెలంగాణ జాగృతి గల్ఫ్‌ అధ్యక్షుడు బెల్లంశెట్టి హరిప్రసాద్‌,  ఉపాధ్యక్షుడు రాజీవ్‌ సాగర్‌, జనరల్‌ సెక్రెటరీ నవీనాచారి ఉన్నారు.

Updated Date - 2020-07-06T20:29:03+05:30 IST