న్యూయార్క్ మాజీ మేయర్‌ Rudy Giuliani కి చెంపదెబ్బ.. నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-27T22:54:22+05:30 IST

వివాదాస్పద మాజీ న్యూయార్క్ సిటీ మేయర్ రుడాల్ఫ్ గిలియానీని గుర్తుతెలియని ఓ వ్యక్తి చెంపదెబ్బకొట్టాడు.

న్యూయార్క్ మాజీ మేయర్‌ Rudy Giuliani కి చెంపదెబ్బ.. నిందితుడి అరెస్ట్

న్యూయార్క్ : వివాదాస్పద మాజీ న్యూయార్క్ సిటీ(NYC) మేయర్ రుడాల్ఫ్ గిలియానీ(Rudolph Giuliani)ని గుర్తుతెలియని ఓ వ్యక్తి చెంపదెబ్బకొట్టాడు. గవర్నర్ రేసులో ఉన్న తన కొడుకు ఆండ్ర్యూ గిలియానీ కోసం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రుడాల్ఫ్‌పై రిటైల్ మార్ట్ ‘షాప్‌రైట్’లో పనిచేస్తున్న ఓ వర్కర్ ఈ దాడి చేశాడు. సిటీలోని స్టెన్ ఐలాండ్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా వెనుక నుంచి వచ్చిన నిందితుడు చేత్తో బలంగా కొట్టాడు. అనూహ్యమైన ఈ పరిణామంతో రుడాల్ఫ్ వణికిపోయారు. ప్రత్యక్షసాక్షి రిటా రుగోవా-జాన్సన్ స్పందిస్తూ..  షాప్‌రైట్ వర్కర్ ఒకరు సూపర్‌మార్కెట్ వద్ద ఈ దాడి చేశారని వివరించారు. ఈ అనూహ్య పరిణామంతో  78 ఏళ్ల రుడాల్ఫ్ భయంతో వణికిపోయారని చెప్పారు. సూపర్ మార్కెట్ వెలుపల తాము మాట్లాడుతుండగా... నిందిత వ్యక్తి బయటకు వచ్చి దాడి చేశాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా నిందిత వ్యక్తికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.


కాగా మాజీ అటార్నీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారు అయిన రుడాల్ఫ్ ఈ ఏడాది ఆరంభంలో వార్తల్లో నిలిచారు. ‘ఫాక్స్’ చానల్లో ఆదరణ కలిగిన ప్రైమ్‌టైమ్ సిరీస్ ‘ ది మాస్క్‌డ్ సింగర్’ 7వ సీజన్‌లో ఆయన మాస్క్ లేకుండానే వేదికపైకి వచ్చారు. గుర్తింపును బయటపెట్టడంతో జడ్జిలు కెన్ జియోంగ్, రాబిన్ తికీ స్టేజీ దిగిపోయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-27T22:54:22+05:30 IST