పిజ్జాలో రేజర్ బ్లేడులు.. సీసీ ఫుటేజ్ చూస్తే షాక్!

ABN , First Publish Date - 2020-10-13T07:48:13+05:30 IST

పిజ్జాలో రేజర్ బ్లేడులు పెట్టి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ఓ

పిజ్జాలో రేజర్ బ్లేడులు.. సీసీ ఫుటేజ్ చూస్తే షాక్!

మెయిన్: పిజ్జాలో రేజర్ బ్లేడులు పెట్టి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మెయిన్ రాష్ట్రంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌లో నిందితుడు పనిచేస్తూ వచ్చాడు. పిజ్జా తయారీ సెక్షన్‌లో పనిచేసే నిందితుడు.. పిజ్జాలలో రేజర్ బ్లేడులు పెడుతూ వచ్చాడు. సూపర్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు తెలియక ఇవే పిజ్జాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే అక్టోబర్ ఆరో తేదీన ఓ కస్టమర్ తన పిజ్జా లోపల బ్లేడులు వచ్చాయంటూ సూపర్ మార్కెట్‌ను సంపద్రించాడు.


ఇదే సమయంలో సూపర్ మార్కెట్ యాజమాన్యం సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. నిందితుడు పిజ్జా తయారీ కాక ముందు పిండిలో రేజర్ బ్లేడులు పెడుతున్నట్టు కనిపించింది. ఈ సీసీ ఫుటేజ్‌ను చూసిన యాజమాన్యం ఒక్కసారిగా షాకైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై, బ్లేడులు పెట్టడానికి కారణాలపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-13T07:48:13+05:30 IST