మాట తప్పితే... పార్టీని రద్దు చేస్తాం

ABN , First Publish Date - 2022-04-13T13:01:12+05:30 IST

జలాల పంపిణీలో రాష్ట్రానికి 75 సంవత్సరాలుగా తీరని అన్యాయం జరిగిందని, దీన్ని ఐదేళ్లలోనే పరిష్కరిస్తామని లేనిపక్షంలో పార్టీని రద్దు చేసుకుని సన్యా సం తీసుకుంటామని

మాట తప్పితే... పార్టీని రద్దు చేస్తాం

- ఏడు దశాబ్దాల అన్యాయానికి ఐదేళ్లలో పరిష్కారం 

- దళపతుల కీలక ప్రకటన


బెంగళూరు: జలాల పంపిణీలో రాష్ట్రానికి 75 సంవత్సరాలుగా తీరని అన్యాయం జరిగిందని, దీన్ని ఐదేళ్లలోనే పరిష్కరిస్తామని లేనిపక్షంలో పార్టీని రద్దు చేసుకుని సన్యా సం తీసుకుంటామని దళపతులు ప్రకటించారు. రామనగరలో మంగళవారం ‘జనతా జలధారె - గంగారథాలు’ కు మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పచ్చజెండా చూపారు. అనంతరం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి వీరు ప్రసంగిస్తూ సరిహద్దు లు, జలాలు, భాష విషయంలో కర్ణాటకకు దశాబ్దాల కాలంగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. తమకు రానున్న ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రగతిని ఉరుకులు, పరుగులు పెట్టించడమే కాకుండా అన్యాయాన్ని సరిదిద్దేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తామన్నారు. మేకెదాటు పథకానికి తమిళనాడు ప్రభుత్వంతో పనిలేదని, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిస్తే చాలని ఇందులో కూడా రాష్ట్ర రైతుల ప్ర యోజనాలను పణంగా పెట్టారన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రేపుతోందని మండిపడ్డారు. గూం డాలు యథేచ్ఛగా స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. వేదికపై జేడీఎస్‌ యువ అధ్యక్షుడు నిఖిల్‌ కుమారస్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలి ర్యాలీ విజయవంతం కావడంతో జేడీఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. 

Updated Date - 2022-04-13T13:01:12+05:30 IST