జాతీయ పార్టీల నిర్వాకంతోనే తాగునీటి సంక్షోభం

ABN , First Publish Date - 2022-05-13T18:02:17+05:30 IST

కోటికిపైగా జనాభా ఉన్న బెంగళూరు నగర అభివృద్ధి మౌలిక సదుపాయాల విషయంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్ర నిర్లక్ష్యం చేశాయని దళపతి మాజీ ప్రధాని

జాతీయ పార్టీల నిర్వాకంతోనే తాగునీటి సంక్షోభం

                        - మాజీ ప్రధాని దేవేగౌడ ఆగ్రహం 


బెంగళూరు: కోటికిపైగా జనాభా ఉన్న బెంగళూరు నగర అభివృద్ధి మౌలిక సదుపాయాల విషయంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్ర నిర్లక్ష్యం చేశాయని దళపతి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ  ఆరోపించారు. నెలమంగళలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన ‘జనతాజలధార’ ముగింపు సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు కానుందన్నారు. 2023 ఎన్నికల్లో తమ పార్టీకి పూర్తి మెజార్టీ ఇస్తే నదీజలాలను బెంగళూరుకు మళ్ళించి చెరువులకు జలకళను సంతరించుకునేలా చేస్తామన్నారు. అంతకుముందు ఆయన భారీ బహిరంగ సభ జరిగే నెలమంగళ మైదానంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సభలో గంగా హారతి ప్రత్యేకంగా ఉంటుందన్నారు. మహాసభకు జరగుతున్న ఏర్పాట్లను ఆయన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంతో కలిసి పరిశీలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు.

Read more