ఉపాధి హామీ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-04-23T05:16:39+05:30 IST

మండలంలోని గుత్ప, అమ్రాద్‌ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గురువారం అదనపు కలెక్టర్‌ లత పరిశీలిం చారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

మాక్లూర్‌, ఏప్రిల్‌22: మండలంలోని గుత్ప, అమ్రాద్‌ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గురువారం అదనపు కలెక్టర్‌ లత పరిశీలిం చారు. ఈ సందర్భంగా కూలీలు తమకు వేతనాలు అందడంలేదని అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా కొలతల ప్రకారం పని చేసే రోజుకు రూ.240 చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. కొవిడ్‌ ఉ న్న దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్‌లు వాడాలని సూచించారు. గుత్ప, గుత్ప తండాలో నర్సరీలను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో సక్రియానాయక్‌తో పాటు వివిధ శాఖల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-23T05:16:39+05:30 IST