వైకుంఠధామాల కోసం స్థలాల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-03T06:06:59+05:30 IST

నారాయణఖేడ్‌, డిసెంబరు 2 : ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లి, మంగల్‌పేటతో పాటు పట్టణంలోని బతుకమ్మకుంట పరిసరాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి దాదాపు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి.

వైకుంఠధామాల కోసం స్థలాల పరిశీలన
ఖేడ్‌ పరిఽధిలోని చాంద్‌ఖాన్‌పల్లిలో స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

నారాయణఖేడ్‌, డిసెంబరు 2 : ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లి, మంగల్‌పేటతో పాటు పట్టణంలోని బతుకమ్మకుంట పరిసరాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి దాదాపు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. బుధవారం తహసీల్దార్‌ దశరథ్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏఈ సంజయ్‌ సర్వేయర్లతో కలిసి వైకుంఠధామాల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించి సర్వే చేపట్టారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. వారి వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పరశురాం, కాంగ్రెస్‌ మున్సిపల్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ దారం శంకర్‌, కౌన్సిలర్లు సంధ్యారాణి, కవిత, స్వప్నషెట్కార్‌, రామకృష్ణ ఉన్నారు. 


Updated Date - 2020-12-03T06:06:59+05:30 IST