చిత్రలేఖనంలో రాణిస్తూ...

ABN , First Publish Date - 2021-07-22T05:30:00+05:30 IST

బొమ్మలు వేయడం నేర్చుకోవాలంటే శిక్షణ అవసరం. కానీ కొందరు మాత్రం శిక్షణ లేకుండానే చూసి నేర్చుకుంటారు. ఆ రెండో కోవకు చెందిన వాడు సాయిగణేష్‌.

చిత్రలేఖనంలో రాణిస్తూ...

బొమ్మలు వేయడం నేర్చుకోవాలంటే శిక్షణ అవసరం. కానీ కొందరు మాత్రం శిక్షణ లేకుండానే చూసి నేర్చుకుంటారు. ఆ రెండో కోవకు చెందిన వాడు సాయిగణేష్‌. ఆ విశేషాలు ఇవి...

సంగారెడ్డి పట్టణానికి చెందిన సాయిగణేష్‌ పలువురు ప్రముఖులు, దేవతామూర్తుల చిత్రాలను అలవోకగా గీస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. స్థానిక బ్రిలియంట్‌ గ్రామర్‌ హై స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న సాయిగణేష్‌ షెడింగ్‌ ఆర్ట్‌ వేయడంలో దిట్ట. గణేష్‌ దిటదదదిఎవరి వద్ద శిక్షణ పొందకుండా టీవీల్లో వచ్చే పేయింటింగ్‌ కార్యక్రమాలను చూస్తూ బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు. 


ప్రముఖుల బొమ్మలు గీసి...

డా. బిఆర్‌. అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, సుభాష్‌చంద్రబోస్‌, జవహార్‌లాల్‌నెహ్రు, భగత్‌సింగ్‌, నందమూరి తారకరామారావు, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ... ఇలా పలువురు ప్రముఖుల చిత్రాలను గీశాడు. తెలుగు ఓనమాలతో దేవతా మూర్తుల ఫోటోలు గీసి ప్రశంసలందుకున్నాడు. ‘‘భవిష్యత్తులో పెద్ద ఆర్టిస్టుగా ఎదగాలన్నది నా లక్ష్యం. అంతేకాకుండా ఆసక్తి ఉన్న వారికి చిత్రలేఖనంలో శిక్షణ కూడా ఇస్తా. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే నేను చిత్రలేఖనంలో రాణిస్తున్నాను’’ అని తన మనసులో మాట పంచుకుంటాడు సాయి గణేష్‌. చిత్రలేఖనంలోనే కాదు ఆత్మరక్షణకు ఉపయోగపడే షావొలిన్‌ కుంగ్‌ఫూ కరాటే విద్యలో గణేష్‌కు ప్రావీణ్యం ఉంది.

Updated Date - 2021-07-22T05:30:00+05:30 IST