
టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): వైసీ పీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కూల్చడం తప్ప... కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగుతున్నాయని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రంనాయుడు చిల్డ్రన్స్ పార్కులో కూల్చివేతలు దారుణమని మండిపడ్డారు. వైసీపీ బరితెగింపును అడ్డుకోలేని అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆదివా రం ట్విటర్లో నిలదీశారు. ‘మీకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల అక్రమణలకు కాదని గుర్తించండి’ అని బాబు హెచ్చరించారు.