‘అధికంగా ఎరువుల వాడకం అనర్థదాయకం’

ABN , First Publish Date - 2022-07-07T05:07:54+05:30 IST

వ్యవసాయంలో అధికంగా ఎరువులు వాడడం అనర్థ దాయకమని వ్యవ సాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు అన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, నియోజకవర్గ వ్యవసాయ పాలకమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు.

‘అధికంగా ఎరువుల వాడకం అనర్థదాయకం’

టెక్కలి: వ్యవసాయంలో అధికంగా ఎరువులు వాడడం అనర్థ దాయకమని వ్యవ సాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు అన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, నియోజకవర్గ వ్యవసాయ పాలకమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా వంటి ఎరువులను అధికంగా వినియోగించడం ప్రమాదకరమని వివరించారు. అధిక దిగుబడి వచ్చే తెగుళ్లు సోకని వరి విత్తనాలకు రైతు లు ప్రాధాన్యత ఇస్తున్నారని, యదలు జల్లేటప్పుడు కలుపు నివారణకు ఏ రకమైన మందు లు పిచికారీ చేయాలో క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని సూచించా రు. ఈ-క్రాప్‌ న మోదు తప్పనిసని, పీఎం కిసాన్‌కు సంబంధించి కూడా ఈకేవైసీ పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో సలహా మండలి చైర్మన్‌ పినకాన వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-07T05:07:54+05:30 IST