గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందుకున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌

Jun 16 2021 @ 23:32PM
సర్టిఫికెట్‌ అందుకుంటున్న మహిపాల్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, జూన్‌16: పర్వతారోహణకు సంబంధించి కరీంనగర్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కానిస్టేబుల్‌ లెంకల మహిపాల్‌రెడ్డి గిన్నిస్‌ రికార్డుకు ఎంపిక కాగా మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌ఏ అజయ్‌రావు చేతుల మీదుగా సర్టిఫికెట్‌ అందుకున్నాడు. ట్రాన్స్‌ అండ్‌ అడ్వెంచర్‌ సంస్థ 2020 ఆగస్టు 15న నిర్వహించిన కార్యక్రమంలో మహిపాల్‌రెడ్డి గిన్నిస్‌ రికార్డుకు ఎంపికయ్యాడు. గతంలో మహిపాల్‌రెడ్డి పర్వతారోహణలో హై రేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లు సాధించాడు. కాగా గిన్నిస్‌ రికార్డు సాధించిన మహిపాల్‌రెడ్డిని కరీంనగర్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పులి నగేష్‌గౌడ్‌, ఎస్‌ఐ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కిషన్‌రావు తదితరులు అభినందించారు. 

Follow Us on: