Advertisement

పది శాతం రిజర్వేషన్‌ల అమలుపై హర్షం

Jan 24 2021 @ 00:20AM
గుడిహత్నూర్‌లో సీఎం కేసీఆర్‌చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

ఆయా మండలాల్లో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఉట్నూర్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని ప్రకటించడంతో మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఇందులో ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ సామ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ దావులే బాలాజీ, మహ్మద్‌ అజీమోద్దిన్‌, సయ్య ద్‌ రషీద్‌, సీతారాం, సతీష్‌, అన్సారీ, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లను అమలుచేయడాన్ని హార్షిస్తూ బోథ్‌లో శనివారం టీఆర్‌ఎస్‌ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఇందులో పార్టీ మండల కన్వీనర్‌ రుక్మన్‌సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల భోజన్న, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్‌యాదవ్‌, వైస్‌ ఎంపీపీ లింబాజి, తదితరులు పాల్గొన్నారు.

భీంపూర్‌: అగ్రవర్ణాలలో ఉన్న నిరుపేదలందరికీ ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు ఒక అమూల్యవరం అని టీఆర్‌ఎస్‌  మండల కన్వీనర్‌ మేకల నాగయ్య అన్నారు. శనివారం మండల కేంద్రం భీంపూర్‌లో ఈ రిజర్వేషన్‌ల విషయంలో అగ్రవర్ణ పేదలతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇందులో జడ్పీటీసీ కుంరాసుధాకర్‌, ఎంపీపీ కుడిమెత రత్నప్రభా సంతోష్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు భూమన్నదోర, సర్పంచ్‌లు మడావి లింబాజి, నరేందర్‌, లస్మన్న, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నేరడిగొండ: రాష్ట్రంలో అర్థికంగా వెనుక బడిన వర్గాల వారికి (ఇడబ్యుఎస్‌) విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తు శనివారం నేరడిగొండ మండల కార్యాలయంలో ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ కేసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇందులో సర్పంచ్‌ పెంటవెంకట రమణ, మండల కన్వీనర్‌ శివారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఇచ్చోడ: ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు(ఈడబ్యూఎస్‌) విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించినందుకు గాను శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్‌యస్‌ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానకి క్షీరాభిషేకం చేశారు. ఇందులో పార్టీ మండల కన్వీనర్‌ పాట్కురి శ్రీనివాస్‌రెడ్డి,  మేరాజ్‌ హైమద్‌, ఏనుగు కృష్ణ రెడ్డి,ప్రకాష్‌ రాథోడ్‌, భాస్కర్‌, సురెందర్‌ రెడ్డి, జుమ్మ, సుభాష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తలమడుగు: అన్నివర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని టీఆర్‌ఎస్‌  మండల కన్వీనర్‌ ఎల్మ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని  సుంకిడిలో తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఇందులో పార్టీ మండల ఉపాధ్యక్షుడు తోట వెంకటేశ్‌, మహిళ అధ్యక్షురాలు కాటిపెల్లి సునితారెడ్డి, సుంకిడి సర్పంచ్‌ మహేందర్‌యాదవ్‌, రైతు సంఘం జిల్లా నాయకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ చంటి,  తదితరులు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో  10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం లో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇందులో ఎంపీపీ రాథోడ్‌పుండలిక్‌, కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌జమీర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement