ఉత్సాహంగా ఎడ్ల పోటీలు

ABN , First Publish Date - 2022-06-27T05:13:56+05:30 IST

శ్రీ అచ్చమాంబ తల్లి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సా హంగా జరిగాయి.

ఉత్సాహంగా ఎడ్ల పోటీలు
ఎడ్ల పోటీలను తిలకిస్తున్న ప్రజలు

పామూరు, జూన్‌ 26 :  శ్రీ అచ్చమాంబ తల్లి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సా హంగా జరిగాయి. ఉదయం అమ్మవారి దర్శ నం, బండ్లు, పొంగళ్ల భక్తులు పూజలు నిర్వ హించారు. అనంతరం నిర్వాహకులు అన్న దానం ఏర్పాటు చేశారు. సాయంత్రం నిర్వ హించిన ఎడ్ల  పొటీల్లో నాలుగు జతలు పాల్గొ న్నాయి. ఈ పో టీలలో దర్శి గ్రామానికి చెం దిన గానుగపంట రాజశేఖరరెడ్డి ఎడ్లు  1400 అడుగులు లాగి ప్రథమ బహుమతి రూ.40 వేలు అందుకున్నారు. బాపట్ల జిల్లా బల్లికు రవకు చెందిన పా వులూరి వీరాస్వామి చౌద రికి చెందిన ఎడ్లు  1202.5 అడుగులు లాగి ద్వితీయ బహు మతిగా రూ.25వేలను దేవస్థానం తరఫున అందజేశారు.  బేస్తవారిపేట  మం డలం జేసీ అగ్రహా రాని కి చెందిన లక్కు నాగ శివశంకర్‌ ఎడ్లు 648.8 అడుగులు లాగి తృతీయ బహుమతిగా రూ.15వేలు, బొట్లగూడూరుకు చెందిన కోట పాటి వెంకటేశ్వర్లు అందించగా, వైఎస్‌స్సార్‌ కడప జిల్లా కాశినాయన మండలం నరసా పురం గ్రామానికి చెందిన కామిని ప్రతాప్‌ రెడ్డికి చెందిన ఎడ్లు 600 అడుగులు లాగి నాల్గవ బహుతిగా రూ.10వేలను  కంభాల దిన్నె గ్రామానికి చెందిన చెరుకూరి శ్రీకాంత్‌ చౌదరి చేతుల మీదుగా అందించారు.  ఎడ్ల ఎడ్ల పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. 

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ఆదివారంతో అచ్చమాంబ బ్రహ్మోత్సావాలు  ముగిసాయని దేవస్థాన నిర్వాహకులు అడు సుమల్లి పెద చెంచయ్య, సరసింహారావు, దుద్దుకూరి యోగానంద్‌, మల్లికార్జున, రావెళ్ల వెంకటరత్నం, తిరుపతయ్య తెలిపారు.  


Updated Date - 2022-06-27T05:13:56+05:30 IST