ఉత్సాహంగా మిస్‌ వైజాగ్‌-2021 ఆడిషన్స్‌..

ABN , First Publish Date - 2021-03-01T06:22:50+05:30 IST

క్రియేటివ్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో మిస్‌ వైజాగ్‌-2021 ఆడిషన్స్‌ సిరిపురంలోని మిస్‌ వైజాగ్‌ స్టూడియోలో ఆదివారం నిర్వహించారు.

ఉత్సాహంగా మిస్‌ వైజాగ్‌-2021 ఆడిషన్స్‌..
ఆడిషన్స్‌లో పాల్గొన్న యువతులు

సిరిపురం, ఫిబ్రవరి 28: క్రియేటివ్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో మిస్‌ వైజాగ్‌-2021 ఆడిషన్స్‌ సిరిపురంలోని మిస్‌ వైజాగ్‌ స్టూడియోలో ఆదివారం నిర్వహించారు. నిర్వాహకులు అజయ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ ఆడిషన్స్‌కు సుమారు 80 మంది వరకు 18 నుంచి 25 ఏళ్లలోపు యువతులు హాజరై తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. మిస్‌ వైజాగ్‌ పోటీలను విశాఖలో తొమ్మిది సీజన్‌లను ఇప్పటివరకు విజయవంతంగా నిర్వహించినట్టు అజయ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు పదో సీజన్‌ ను మరింత ప్రతిష్టాత్మకంగా, ఉచితంగా చేపడుతున్నామన్నారు. క్యాట్‌వాక్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, తదితర విభాగాలలో యువతలు పాల్గొన్నారన్నారు. వీరిలో ఎంపికైన వారిని నాలుగు, ఐదు ఆడిషన్స్‌లో చోటు కల్పించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో గ్రాండ్‌ ఫినాలే ఉంటుందన్నారు. 

Updated Date - 2021-03-01T06:22:50+05:30 IST